28 April, 2026 | 3:06 AM

రామప్ప సందర్శనలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు

28-04-2026 12:55 AM

వెంకటాపూర్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయాన్ని సోమవారం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) ఉన్నతాధికారులు ఈడీ ఎస్.కే. గుప్తా, జేఈ గౌరవ్ చౌదరి, జేజీఎం బాలేందర్ కుమార్, డీజీఎం లు ఉమేష్ కుమార్, పర్విందర్ తివారి, వాసీమ్, ఎజీఎం గోపాలకృష్ణ లు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ లు అధికారులకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ స్వామివారి శేషావస్త్రాలను అధికారులకు బహుకరించగా, అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా టూరిజం గైడ్ గోరంట్ల జయకుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. అనంతరం అధికారులు రామప్ప చెరువును సందర్శించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట విమానాశ్రయ అధికారులు, సిబ్బంది, ఆర్‌ఐ రమేష్, టూరిస్ట్ పోలీస్ అరుణ్, దేవాదాయ, పురావస్తు, టూరిజం, రెవెన్యూ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.