3 June, 2026 | 1:36 AM

జేఈఈ ఫలితాల్లో ఆకాశ్ సత్తా

03-06-2026 01:06 AM

విద్యార్థులకు జాతీయ స్థాయి ర్యాంకులు

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): భారతదేశంలోని ప్రముఖ టెస్ట్ ప్రిపరేషన్ సంస్థ అయిన ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్‌ఎల్) జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో అద్భుతమైన విజయం అందుకుంది. తమ విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థా యిలలో అగ్ర ర్యాంకులను సాధించారు.

జాతీయ స్థాయిలో 4, 17, 35, 42, 52, 59, 63, 86, 94 లతో సహా టాప్ 100లో 9 ర్యాంకులను సాధించారు. తెలంగాణలో, మోహిత్ శేఖర్ శుక్లా 319 మార్కుల అసాధారణ స్కోరుతో 4వ ర్యాంకు సాధించి రాష్ట్రంలో అగ్రశ్రేణి ప్రదర్శకుడిగా నిలిచారు. తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు టా ప్ 100 లోపు, ముగ్గురు టాప్ 200 లోపు, 8 మంది 1000 లోపు ఆల్ ఇండియా ర్యాంకులను సాధించారు.

తెలంగాణ నుండి పరీక్షలో అద్భుతమైన ర్యాంకులు సాధించిన ఇతర ముఖ్య విద్యార్థులలో జయంత్ శేఖర్ (ఆల్ ఇండియా ర్యాంక్ 94, 276 మార్కు లు), హంజాలా అబెదీన్ (ఆల్ ఇండియా ర్యాంక్ 105, 274 మార్కులు), శివ తేజంషు ఎ (ఆల్ ఇండియా ర్యాంక్ 374, 241 మా ర్కులు), ఆలమూరి చైతన్య (ఆల్ ఇండియా ర్యాంక్ 634, 225 మార్కులు), రిషిత్ కైతం (ఆల్ ఇండియా ర్యాంక్ 676, 223 మార్కు లు), దీపక్ నికేతన్ కార్తీక్ (ఆల్ ఇండియా ర్యాంక్ 799, 218 మార్కులు), బి. అభిజీత్ రెడ్డి (ఆల్ ఇండియా ర్యాంక్ 844, 217 మా ర్కులు) ఉన్నారు. విద్యార్థులను ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ అకడమిక్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా అభినందించారు.