3 June, 2026 | 1:36 AM

ఆర్‌జీరావు ట్రస్ట్ ఆవిర్భావ వేడుకలు

03-06-2026 01:04 AM

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): విద్యా రంగంలో రెండు దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తున్న ఆర్‌జి రావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తన 20వ ఆవిర్భావ దినోత్స వాన్ని బాచుపల్లిలోని సూర్యా గ్లోబల్ స్కూ ల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించింది. గత 20 సంవత్సరాలుగా గ్రామీణ, వెనుకబడిన వర్గాలకు చెందిన వెయ్యికి పైగా విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావడంలో ట్రస్ట్ కీలక పాత్ర పోషించింది.

ముఖ్య అతిథులుగా ఎస్ నరసింహారావు (రిటైర్డ్ ఐఏఎస్), ప్రొఫెసర్ రామయ్య, గండ్ర మోహనరావు (హైకోర్టు న్యాయవాది) హాజరయ్యారు. విద్యా, సామాజిక రంగాల్లో ట్రస్ట్ అందిస్తున్న సేవలను వారు అభినందించా రు. ఈ వేడుకలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా నిర్వహించబడ టంతో కార్యక్రమానికి మరింత ప్రత్యేకత చే కూరింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి మరియు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ హించారు. విద్యార్థులు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించగా, పాఠశాల పూర్వ విద్యార్థులు (అలుమ్నీ) కూడా హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు.