27 June, 2026 | 7:05 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

భావి భారత పౌరులుగా అక్కెనపల్లి విద్యార్థులు

04-03-2026 07:29 PM

నంగునూరు,(విజయకాంతి): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య పద్ధతులపై అవగాహన పెంపొందించేందుకు మండల పరిధిలోని అక్కెనపల్లి మోడల్ స్కూల్ లో బుధవారం మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ మంద జానయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో విద్యార్థులు స్పీకర్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుల పాత్రలను పోషించి సభను నడిపించారు.

స్పీకర్‌గా ఎస్. వెన్నెల, ప్రధానిగా వి.మనోజ్, ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు. చట్టాల రూపకల్పన, ప్రశ్నోత్తరాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రాయోగిక అవగాహన లభించిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రిన్సిపాల్ తెలిపారు. సీనియర్ అధ్యాపకులు డా. ఎస్. శ్రీనివాస్, ఎ. శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.