calender_icon.png 5 July, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అక్షయ

05-07-2025 12:00:00 AM

స్టేట్ అథ్లెటిక్ పోటీలో బెల్లంపల్లి విద్యార్థిని

బెల్లంపల్లి అర్బన్, జూలై 4 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ విద్యార్థిని అథ్లెటిక్ స్టేట్ పోటీలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ లో జరిగిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ -2025లో అండర్ 8 ఇయర్స్ గ్రూపులో బెల్లంపల్లి లోటస్ పాఠశాలకు చెందిన  అడిచర్ల అక్షయ లాంగ్ జంప్ అథ్లెటిక్స్ ఈవెంట్ లో స్టేట్ లో 5వ స్థానం, జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. స్టేట్ ఈవెంట్ లలో పాల్గొని అత్యంత క్రీడా ప్రతిభను ప్రదర్శించిన  విద్యార్థి అక్షయను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయు లు అభినందించారు.