calender_icon.png 5 July, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిద్దాం

05-07-2025 12:00:00 AM

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ జూలై 4 (విజయ క్రాంతి) : దొడ్డి కొమరయ్య ఆశయాలను కొనసాగిద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి ర క్తపు చుక్క తెలంగాణ హక్కుల సాధన వేగుచుక్కపై వెలుగొందిన మహనీయుడన్నారు.

అంతకుముందు కలెక్టరేట్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రవీణ్, ఎక్స్ కౌన్సిలర్స్ రాశాద్, పాష, గంజి వెంకట్రాములు, అంజాద్, కట్టా రవి కిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, అంజనేయులు, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.