23 April, 2026 | 2:27 PM

Breaking News

కార్పొరేట్ శక్తులకు బీజేపీ ఊడిగం

10-05-2024 01:15 AM

ఆకునూరి మురళి

నాగర్‌కర్నూల్, మే 9 (విజయక్రాంతి): కార్పొరేట్ శక్తులకు బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాటు ఊడిగం చేసి అపర కుబేరులను చేసిందని, పదేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన మేలు శూన్యమని విశ్రాంత ఐఏఎస్, జాగో తెలంగాణ సంస్థ కన్వీనర్ ఆకునూరి మురళి తేల్చిచెప్పారు. అంబానీ, ఆదానీల వేల కోట్ల అప్పులను మాఫీ చేసిందని మండిపడ్డారు. ఓటర్ల చైతన్య యాత్రలో భాగంగా గురువారం ఆయన నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. భారత్ అన్నిరంగాల్లో వృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంటే, ప్రధాని మోదీ మాత్రం ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు రాజ్యాంగాన్ని మార్చాల కుంటున్న బీజేపీని ఎన్నికల్లో ఓడించాలన్నా రు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బీఆర్‌ఎస్, బీజేపీకి ఓటు వేయొద్దన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎస్సీ, ఎస్టీలను మోసగించి సిగ్గులేకుండా బీఆర్‌ఎస్‌లో చేరారని మండిపడ్డారు. కార్యక్రమంలో వెంట ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ, పద్మజ, జానయ్య పాల్గొన్నారు.