‘జీవన్‌రెడ్డి మాల్’ సీజ్‌కు యత్నం
నోటీసులు ఇచ్చేందుకు మాల్‌కు వెళ్లిన ఆర్టీసీ ఆర్‌ఎం, డీఎం
కొంతమేర బకాయి చెల్లించి తప్పించుకున్న యాజమాన్యం
నిజామాబాద్, మే 9 (విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణంలోని 7,060 గజాల ఆర్టీసీ స్థలం లీజ్ బకాయి వసూలు అంశం ‘ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కు..’ అన్నట్లు సాగుతున్నది. సదరు స్థలం నుంచి మాల్ నిర్మించిన యజమా న్యం ఆర్టీసీకి రూ.3.14 కోట్లు చెల్లించాల్సి ఉండగా మాల్ యాజమాన్యం నుంచి పెద్ద గా స్పందన లేదు. ఆర్టీసీ అధికారులు మాత్రం నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు. గత ఏడాది మాల్ యాజమాన్యం కొంత మొత్తంలో బకాయి చెల్లించి చేతులు దులుపుకొన్నది. ఆ తర్వాత షరా మామూలే అన్న ట్లు యాజమాన్యం మళ్లీ బకాయి చెల్లంచకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్న ది. దీంతో గురువారం ఆర్టీసీ అధికారులు మాల్ ను సీజ్ చేసేందుకు వెళ్లి మళ్లీ వెనుదిరిగారు. ఆర్మూర్ ఆర్టీసీ డీఎం బంటుపల్లి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెందిన విశ్వజిత్ ఇన్ఫ్రాస్టక్చర్స్ సంస్థ 2013లో ఆర్టీసీ స్థలాన్ని బిల్డ్ పద్ధతిలో 33 ఏళ్లకు లీజ్‌కు తీసుకున్నది. ఒప్పందం ప్రకా రం ఆ స్థలంలో షాపింగ్ మాల్ నిర్మించి 2046 వరకు షాపింగ్ కాంప్లెక్స్‌ను అనుభవించాల్సి ఉన్నది. ఆ తర్వాత ఆర్టీసీ యాజ మాన్యానికి అప్పగించాలి.
అందుకు మాల్ యాజమాన్యం నెలకు ఆర్టీసీకి రూ.16 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు కిరాయి చెల్లించాలి. ఈ కిరాయి ఏటికేడు కొంత శాతం పెరుగుతూ వెళ్తుంది. కానీ యాజమాన్యం ‘జీవన్‌రెడ్డి’ పేరిట మాల్ అయితే నిర్మించి అద్దెలకు ఇచ్చింది తప్పిదే, ఆర్టీసీ మాత్రం కిరాయి చెల్లించడం లేదు. అలా బకాయి పెరిగి పెరిగి ప్రస్తుతం రూ.3.14 కోట్లకు చేరుకున్నది. ఆర్టీసీ అధికారులు గత ఏడాది నుంచి మాల్ యాజమాన్యానికి అనేకసార్లు నోటీసులు అందించారు. దీంతో యాజమాన్యం బకాయి మొత్తంలో కొంతమేరకు చెల్లించింది. తర్వాత షరా మామూలే. యాజమాన్యం మళ్లీ బకాయి సంగతి పట్టించుకోలేదు. ఆర్టీసీ అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో మాల్ యాజమాన్యం తమకు కొంత గడువు కావాలని హైకోర్టు ను ఆశ్రయించింది. కానీ హైకోర్టు గడువు ఇచ్చేందుకు అంగీకరించలేదు. తాజాగా గురువారం ఆర్టీసీ ఆర్‌ఎం శంకర్, ఆర్మూర్ డిపో మేనేజర్ ఆంజనేయు లు, సిబ్బంది మాల్‌కు వెళ్లి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి మాల్‌ను సీజ్ చేస్తున్న ట్లు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఆన్‌లైన్‌లో ఆర్టీసీకి కొంతమేర బకాయి చెల్లించింది. దీంతో సీజ్‌ను నిలిపివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో చేసేదేం లేక వారు వెనుదిరిగారు.






