2 July, 2026 | 5:10 PM

Breaking News

ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   పారిశుధ్యం అప్రమత్తంగా ఉండాలి   •   పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు   •   చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు   •   వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి   •   పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక   •   పోలీస్ సిబ్బందికి రివార్డులు   •   ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •  

ఆ నాలుగు భాషల్లో అలప్పుళ జింఖానా

08-06-2025 12:00 AM

స్పోర్ట్స్, కామెడీ, డ్రామా వంటి అంశాలతో రూపుదిద్దుకున్న మలయాళ చిత్రం ‘అలప్పుళ జింఖానా’. ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించడమే కాక జాబిన్ జార్జ్, సమీర్ కరాట్, సుబీష్ కన్నంచేరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. నస్లెన్, లుక్‌మాన్ అవరాన్, గణపతి ఎస్ పొడువాల్, సందీప్ ప్రదీప్, అనఘా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్, శివ హరిహరన్ తదితరులు నటించారు.

కథలోని చక్కటి కామెడీని, గందరగోళాన్ని బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ వేదికగా మరో నాలుగు భాషల్లో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమైంది. ఓటీటీ మాధ్యమం సోనీ లివ్‌లో జూన్13 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సందర్భంగా నస్లెన్ మాట్లాడుతూ.. “అలప్పుళ జింఖానా’లో నేను జోజో పాత్రలో నటించటం మంచి అనుభూతినిచ్చింది. ఈ పాత్రలో నటించటం ద్వారా నాలోని బలహీనతలు, బలాలను తెలుసుకోగలిగాను. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావటం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.