calender_icon.png 11 September, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలయ్ బలయ్‌ను విజయవంతం చేయాలి

09-09-2025 01:00:40 AM

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ..

ముషీరాబాద్, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): అక్టోబర్ 3న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించ తలపెట్టిన అలయ్ బలయ్ -2025  కార్యక్రమాన్ని అన్ని వర్గాలవారు హాజరై విజయవంతం చేయాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం  హైదరాబాద్ రామ్‌నగర్‌లో అలై బలాయ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి  అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది.

ఆయన మాట్లాడుతూ   అక్టోబరు 3వ తేదీన హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 20వ సంవత్స రం అలయ్ బలై జరుపుకోవాలని సమావేశం తీర్మానించిందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి,  ప్రేంసింగ్ రాథోడ్,  మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు, వేముల అశోక్, దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్, ఓబీసీ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు జి. ఆనంద్ గౌడ్, బి. శ్యాంసుందర్ గౌడ్,  బాల్ద అశోక్, సీనియర్ జర్నలిస్ట్ బాల్ద అశోక్,  కార్పొరేటర్ కొంతం దీపిక, హైదరాబాద్ సెంట్రల్ బిజెపి ప్రధాన కార్యదర్శి ఇ. అజయ్  ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.