calender_icon.png 11 September, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం

09-09-2025 01:00:33 AM

సుల్తాన్ బజార్ బ్రాంచీలో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): సుల్తాన్ బజార్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో సోమవారం 120 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. నాగేష్ ప్రసంగించారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా నేటి వరకు సాధించిన విజయాలకు ప్రధాన కారణం కస్టమర్ల నమ్మకం మరియు సిబ్బంది అంకితభావం అన్నారు. బ్రాంచ్ మేనేజర్ కె. విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, సుల్తాన్ బజార్ బ్రాంచ్ ఎల్లప్పుడూ కస్టమర్ ఫ్రెండ్లీ సర్వీస్ అందించడంలో ముందంజలో ఉంటుంది అన్నారు.