19-01-2026 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి, జనవరి 18 :దక్షిణ భారతదేశంలో విద్యార్థుల శాస్త్రీయ ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించనున్న సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ (SISF)2026 కు సంబంధించిన అ న్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈనెల 19 నుంచి 23 వరకు రామచంద్రపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఈ సైన్స్ ఫెయిర్ను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.
దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ఎంపికైన 210 నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు ఈ సైన్స్ ఫెయిర్లో ప్రదర్శించ న్నట్లు కలెక్టర్ తెలిపారు. బాల శా స్త్రవేత్తలు తమ ప్రతిభను చాటిచెప్పేలా 210 ఎగ్జిబిట్స్ తో పాటు ఎన్జిఓల ద్వారా 40 సైన్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నూతన ఆలోచనలు, పరిశోధనలతో రూపొందిన ఈ ఆవిష్కరణలు శాస్త్ర సాంకేతికతకు చేయూతనిస్తూ, విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం కల్పించనున్నట్లు వెల్లడించారు.