calender_icon.png 19 January, 2026 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి అందాల నడుమ సింగరాయ జాతర

19-01-2026 12:00:00 AM

స్వామి వారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

బెజ్జంకి,జనవరి 18:ప్రస్తుత సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్, కూరెళ్ల, తంగళ్లపల్లి సరిహద్దులోని రెండుగుట్ట మధ్య పచ్చని చెట్టలతో కూడిన ప్రకృతి అందాల నడుమ వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి సింగరాయ జాతర ఆదివారం ఉదయం 5 గంటల నుంచి ఘనంగా ప్రారంభమైనది. భక్తులు మోయతుమ్మెద వాగులో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటున్నారు.

భక్తులు మోయతుమ్మేద వాగులో నే చెలమలు తోడి, ఆ నీటితో వంకాయ కూర, చింతపండు చారు వండుకుని నైవేద్యం సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కొనసాగే ఈ జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జాతరకు సంబంధించి భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.-  సిగరయ్య లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న మంత్రి అన్న ప్రభాకర్...

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారినీ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు అందరి పై వుండాలి ప్రజలాంత సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవటం జరిగిందన్నారు.ఈ జాతరకు సంబంధించి భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఏర్పాట్లను సమీక్షించి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.