10 July, 2026 | 3:50 AM

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి

10-07-2026 01:59 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

వెల్దండ, జూలై 9: పార్టీ బిఎల్‌ఎలు నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేసే అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. టిపిసిసి ఆదేశానుసారం గురువారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏజెంట్ల, పార్టీ నాయకుల కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బిఎల్‌ఎలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చురుకుగా పాల్గొనాలని, ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఓటరు పేరు సక్రమంగా ఉండేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ ఏజెంట్లు బిఎల్‌ఓలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ ప్రతి బూత్ లోని ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ఏ ఓటరు పేరు తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భూపతిరెడ్డి, డీసీసీ కార్యదర్శి మోతిలాల్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్, వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్,కిసాన్ సెల్ అధ్యక