15 March, 2026 | 8:36 AM

సంగారెడ్డిలో జగ్గారెడ్డి హల్‌చల్!

15-03-2026 01:43 AM

ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం

అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాదం

సంగారెడ్డి, మార్చి 14 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు దహనం చేయడంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వైఖరికి నిరసనగా శనివారం సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద  ప్రధాని మోదీ దిష్టి బొమ్మను జగ్గారెడ్డి దహనం చేశారు.

పోలీసులు అడ్డుకునే ప్ర యత్నం చేయగా కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు తోపులాట జరిగింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడు తూ.. దేశంలో గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హోటళ్లు, రెస్టారెంట్‌లు మూత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి మోదీ రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ దిగుమతి చేసుకోవడంలో మోదీ విఫలం అయ్యాడని విమర్శించారు. ఇదే విషయమై రాహుల్ గాంధీ పార్లమెంట్ బయట నిరసన వ్యక్తం చేశారన్నారు.