19 July, 2026 | 2:14 AM

నీట్‌లో ఆల్ ఇండియా 13వ ర్యాంక్

19-07-2026 12:00 AM

వరంగల్ విద్యార్థి సహ్యూ సత్తా

హనుమకొండ, జూలై 18 (విజయక్రాంతి): వరంగల్ ఎస్‌ఆర్ కళాశాల విద్యార్థి వీరయ్యగారి సహ్యూ నీట్--2026లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 13వ ర్యాంక్ సా ధించి వరంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తిం పు తీసుకొచ్చాడు. దేశవ్యాప్తంగా 705 మార్కులు సాధించిన సహ్యూ, తన లక్ష్యం ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ సీటు సాధిం చి కార్డియాక్ సర్జన్ కావడమే అని తెలిపాడు.

డాక్టర్ వీరయ్యగారి రమాకాంత్, డాక్టర్ శ్రీదేవి దంపతుల కుమారుడైన స హ్యూ మాట్లాడుతూ.. ఎస్‌ఆర్ కళాశాల అ ధ్యాపకుల మార్గదర్శకత్వంలో 108 గ్రాండ్ టెస్టులు, 500కుపైగా వారాంతపు పరీక్షలు రాయడం తన విజయానికి ఎంతో దోహదపడిందన్నారు.

ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలపై పట్టు, కాన్సెప్ట్ ఆధారిత అధ్యయనం, తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహమే ఈ విజయానికి కారణమని పేర్కొంటూ, విద్యార్థులు పరీక్షలకు భయపడకుండా లక్ష్యంతో కష్టపడి చదివితే తప్పకుండా విజ యం సాధిస్తారని సూచించారు.