19 July, 2026 | 2:14 AM

అల్ఫోర్స్‌లో విజయోత్సవ సంబురాలు

19-07-2026 12:00 AM

మొదటి ప్రైవేట్ రాకెట్ లాంచ్ విజయవంతమవడంతో హర్షం

కొత్తపల్లి, జూలై 18 (విజయక్రాంతి): మొదటి ప్రైవేట్ రాకెట్ లాంచ్ విజయవం తం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అల్ఫోర్స్ పాఠశాలలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మా ట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్ స్టాప్ స్కై రూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన దేశపు మొట్టమొదటి ప్రవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించిందని చెప్పారు.

ఈ  చారిత్రాత్మక ప్రయోగం విజయవంతమైనదని అన్నారు. దీని ద్వారా స్పేస్ కాస్మో సెర్చ్, తదితర సంస్థలకు చెందిన టెక్నాలజీ నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.