24 April, 2026 | 7:50 PM

ఇల్లందు పట్టణంలో జరుగు అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ మహా సభలను విజయవంతం చేయండి

24-04-2026 06:35 PM

దమ్మపేట,(విజయక్రాంతి): 2026 మే 11,12,13 తేదీలలో ఇల్లందు పట్టణంలో జరుగు అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని మే 11వ తేదీన ఇల్లెందు పట్టణంలో జరుగు భారీ ర్యాలీ, బహిరంగ సభను జయప్రదం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము కోరారు. లింగాలపల్లి, జమేదారు బంజరు, గురవాయిగూడెం, పార్కలగండి, చిల్లగుంపు, కొత్తూరు, గొర్రెగుట్ట, జగ్గారం, పాకలగూడెం, గండుగలపల్లి గ్రామాలలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూ వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి కృషి చేస్తున్నదని తెలిపారు.

అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగానికి మద్దతుగా అఖిల భారత సంఘం పోరాడుతున్నదని, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్ప చెప్పాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వం విధానాలని ఎండగట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్  మాస్ లైన్ మండల కార్యదర్శి కుర్సం ముత్యాలరావు, వాడే గిరిబాబు, చాప ముత్యాలరావు, కాకా వెంకటేష్, తెల్లం నాగేష్, తెల్లం నాగరాజు, బొగ్గం రాము, కుంజ లక్ష్మణుడు, తామ రాముడు కుంజ పాపారావు, కుంజ కాంతారావు, ఊరికే మహేష్, కొరస శ్రీను, కేసరి వెంకటేష్, సోయం శ్రీను, రవి, కాక మహాలక్ష్మి, పొట్ట ముత్తమ్మ, విజయ, కొండ్రు లక్ష్మి సున్నం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.