24 April, 2026 | 8:07 PM

విశారదన్ మహారాజ్ ముందస్తు అరెస్ట్

24-04-2026 06:23 PM

జవహర్ నగర్/దమ్మాయిగూడ,(విజయక్రాంతి): ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజును జవహర్ నగర్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపేందుకు వెళుతున్నాడనే సమాచారంతో దమ్మాయిగూడలో నివాసముంటున్న విశారదన్ మహరాజును శుక్రవారం పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ... అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని... ప్రభుత్వం మేల్కొని ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. సిఐ సైదులు, ఎస్సైలు రామ్ నాయక్, ఇద్రిస్ అలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు