06-01-2026 01:23:28 AM
స్టార్ మ్యాప్ ఎల్‌ఈడీ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్, ప్రీమియం టెక్ ఫీచర్లతో నెక్స్ట్‌జెన్ ఎస్‌యూవీ
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): కియా మోటార్స్‌కు చెందిన నెక్స్ జనరేషన్ ప్రీమియం ఎస్‌యూవీ ఆల్-న్యూ కియా సెల్టోస్‌ను సోమవారం హైదరాబాద్‌లోని కియా షోరూంలు జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుల్లో ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆటోమొబైల్ అభిమానులు, కస్టమర్లు, నగర వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వాహనాన్ని స్టార్ హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా నీలం రమణ ఆవిష్కరించారు. ఆల్-న్యూ కియా సెల్టోస్ బోల్, ఆధునిక ఎక్స్టీరియర్ డిజైన్‌తో ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. రీడిజైన్ చేసిన బాడీ ఎలిమెంట్స్‌తో పాటు కియా సిగ్నేచర్ స్టార్ మ్యాప్ ఎల్‌ఈడీ లైటింగ్ వాహనానికి ఫ్యూచరిస్టిక్ రోడ్ ప్రెజెన్స్‌ను అందిస్తున్నాయి.
స్టైలిష్ అలాయ్ వీల్స్ ఎస్‌యూవీకి మరింత ఆకర్షణను జోడిస్తున్నాయి. భద్రత పరంగా ఈ లెవల్-2 ఏడీఏఎస్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కార్ కియా వైస్ ప్రెసిడెంట్ సేల్స్ బి సంతోష్ చంద్ మాట్లాడుతూ.. ఆల్-న్యూ కియా సెల్టోస్ డిజైన్, టెక్నాలజీ, భద్రత పరంగా ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది అని తెలిపారు. ఆల్-న్యూ కియా సెల్టోస్ ధరలు రూ.10,99,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ వాహనం ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్ని కియా షోరూంలలో ప్రదర్శనకు, టెస్ట్ డ్రైవ్లకు అందుబాటులో ఉంది.