16 April, 2026 | 3:10 AM

కార్యకర్తలకు అండగా ఉంటా

06-01-2026 01:23 AM

స్థానికేతరులను నమ్మకండి : జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 

జుక్కల్, జనవరి 5 (విజయ క్రాంతి) : బిఆర్‌ఎస్ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని పార్టీ కోసం అందరూ గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. సోమవారం ఆయన ఖండేబల్లూర్ గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరికల కార్యక్రమాన్ని చేపట్టారు. ఖండవులు గ్రామానికి చెందిన ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన కొమ్ము స్నేహ శ్రీనివాస్ తో పాటు పలువురు వార్డు సభ్యులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విధంగా నాగల్గాం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కపిల్ పటేల్ కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. సుమారుగా 100 మంది వరకు కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు  బిఆర్‌ఎస్ లో చేరారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులకు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

టిఆర్‌ఎస్ కార్యకర్తలకు భయభ్రాంతులకు గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు పన్నాగాలు పడుతున్నారని. పథకాల పేరిట బెదిరిస్తే ఎవరు కూడా భయపడద్దని సూచించారు. తాను స్థానికంగా ఉండే అభ్యర్థినని స్థానికేతరులకు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. రానున్న రోజుల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని పేర్కొన్నారు.

రెండున్నరేళ్ల సమయం గడిచిపోయాయని మరో ఏడాది అయితే ఎన్నికల సమయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొల్లి గంగాధర్, మాజీ ఎంపీపీ బస్వంత్ శేట్కర్, రమేష్ వాస్రే, రాజశేఖర్ పటేల్, శివాజీ పటేల్, సదు పటేల్, హన్మ రెడ్డి, వెంకట్ రెడ్డి, శివరాజ్ దేశాయ్, మాజీ సర్పంచ్ మోయిన్, రాజు గజ్రే, కపిల్, రఫి తదితరులు పాల్గొన్నారు.