10-01-2026 03:43:12 PM
- నిజాన్ని నిర్భయంగా తెలియజేయండి
విజయ క్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రజల సమస్యలను వెలిగితేసి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ తక్కువ సమయంలోనే విజయ క్రాంతి దినపత్రిక అందరి మన్ననలు పొందుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయ క్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అభివృద్ధికి మరింత చేయూతనిచ్చేలా మీడియా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా విజయ క్రాంతి దినపత్రిక యాజమాన్యానికి, జర్నలిస్టులకు ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.