ఐదున్నర ఎకరాలలో మహాప్రస్థానం నిర్మాణానికి అఖిలపక్షం అంగీకారం
మధిర,(విజయక్రాంతి): మధిర పట్టణంలో హిందూ స్మశాన వాటిక లో ప్రజలు కనీస సౌకర్యాలు లేక పడుకున్నారు. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు పలుమార్లు అభివృద్ధి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మధిర పట్టణ అభివృద్ధిలో భాగంగా ఐదున్నర ఎకరాలలో మహాప్రస్థానం నిర్మాణానికి అఖిలపక్షం అంగీకారం లభించింది. శనివారం పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో అఖిలపక్షం సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం హిందూ స్మశాన వాటికలో ఉన్న 108 సమాధులను తొలగించే విషయంలో మృతుల కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆ సమాధులపై ఉన్న శిలాఫలకాలను ప్రత్యేకంగా ఒక వైపున వరుస క్రమంలో అమర్చి, వాటి గుర్తింపును కాపాడేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, స్మశాన వాటికను శుభ్రంగా, సక్రమంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని నాయకులు తెలిపారు.






