14 July, 2026 | 11:22 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

నిజాంసాగర్ ప్రాజెక్టు భూముల రక్షణ కోసం అఖిలపక్ష ధర్నా..

27-05-2025 04:41 PM

రైతుల హక్కుల కోసం గొంతెత్తిన నేతలు..

వేరే నియోజకవర్గాల అవసరం కోసం మా భూములు ఇవ్వం..

నిజాంసాగర్ (విజయక్రాంతి): పక్క నియోజకవర్గాల అవసరాల కోసం తమ నియోజకవర్గంలోని భూములను ఇచ్చేది లేదని నిజాంసాగర్ మండలం(Nizamsagar Mandal) ప్రజలు అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. నిజాంసాగర్ రైతుల హక్కుల పరిరక్షణ కోసం మంగళవారం నాడు నిజాంసాగర్ మండలంలో అఖిలపక్ష ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు పాల్గొని రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశ్యం నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని భూములను పక్క నియోజకవర్గాల అవసరం నిమిత్తం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

వేరే నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం అడవి భూమిని తీసుకున్న ప్రభుత్వం దానికి బదులుగా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట రెవెన్యూ శివారులో గల నిజాంసాగర్ ప్రాజెక్టు భూమిని అటవి శాఖకు కేటాయిస్తున్నారని సమాచారం మేరకు రైతులు వినతులు చేస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకతాటిపైకి వచ్చి ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ... రైతుల హక్కులు అనేది రాజకీయాలకు అతీతమని, భూముల రక్షణ కోసం అన్ని పార్టీలు కృతనిశ్చయంతో ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు. ధర్నా ప్రాంతంలో శాంతియుతంగా నిరసనలు కొనసాగుతూ, ప్రభుత్వాన్ని జ్ఞాపింపచేసే విధంగా ప్లకార్డులు ప్రదర్శించారు. 

అఖిలపక్ష ధర్నా రైతుల సమస్యల పట్ల సమాజం చూపవలసిన చైతన్యాన్ని ప్రతిబింబించిందీ.భవిష్యత్తులో కూడా ఈ పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పిట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, గైని విటల్, నరసింహారెడ్డి, యాటకారి నారాయణ, ప్రజా పండరి, మేకల విజయ్, లింగగౌడ్, సత్యగౌడ్, సంకు లక్ష్మయ్య, రాము రాథోడ్, పెద్ది అంజయ్య, పిట్ల సత్యనారాయణ, మార్పల్లి రాములు, గుమస్తా శ్రీధర్ పాల్గొన్నారు.