ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తాం
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు
సచివాలయంలో అఖిలపక్ష సమావేశం
హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీతో గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో అఖిల పక్ష సమావేశం జరిగింది.
సమావేశం అనంతరం కేకే మాట్లాడుతూ.. విద్యార్థులు, ఉద్యమకారుల సంఘాలు, కవులు, కళాకారులను కూడా కలుస్తామన్నారు. ఉద్యమకారులందరినీ పిలిచి మాట్లాడతామని పేర్కొన్నారు. అఖిల పక్షం సమావేశంలో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారని చెప్పారు. ఉద్యమ కారుల గుర్తింపుపై పనులను విభజించి, కమిటీ నివేదికకు టైమ్ బాండ్ ఆలో చిస్తున్నామని తెలిపారు. ఉద్యమకారులకు న్యాయం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
అందుకోసం ఉద్యమకారులందరితోనూ మాట్లాడతామన్నారు. నష్టపోయిన అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. పార్టీలు మాత్రమే కాకుండా ఉద్యో గ, విద్యార్థి, జర్నలిస్ట్, న్యా యవాదులు అందరినీ పిలి చి మాట్లాడతామని వివరించారు. కవులు, కళాకారులు తెలంగాణ సాధన కోసం పని చేసిన అందరిని గుర్తిస్తామన్నారు. ఈ ప్రక్రియ అమరవీరుల ద్వీపంలో ప్రా రంభమవుతుందని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విజ్ఞప్తులు స్వీకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ప్రజా సం ఘాలు, కుల సంఘాలు, విద్యార్థి జేఏసీ, యూనివర్సిటీ జేఏసీలను సంప్రది స్తామని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వెల్లడించారు.






