‘పోలవరం’తో భద్రాచలానికి జలగండం
ముంపు గ్రామాలకే కాదు.. పరిశ్రమలకు కూడా బ్యాక్ వాటర్ ముప్పు
భద్రాచలం వద్ద కరకట్టల నిర్మాణం చేపట్టాలి
పీపీఏ సీఈఓకు మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రచలం పట్ట ణానికి నిత్యం జలగండమే, దీంతో కరకట్టలు నిర్మించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పోలవరం పూర్తిస్థాయి నీటిమట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా సరిగ్గా అదే 45.72 మీటర్లు అని, ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ఎల్లప్పుడూ ముంపు ప్రమాదమేనని తెలిపారు.
పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు హరీశ్‌రావు గురువారం లేఖ రాశారు. పోలవరం పూర్తయితే బ్యాక్ వాటర్ ప్రభావంతో భద్రాచలంలో ఎప్పు డూ 13.15 మీటర్ల నుంచి 17.72 మీటర్ల మేర నీరు నిలిచి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, పెండింగ్ డీఏలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభు త్వం మోసం చేసిందని విమర్శించారు.






