ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మొయినుద్దీన్
జగిత్యాల, జూన్ 4 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రం లోని అటవీశాఖ కార్యాలయంలో గురువారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఒక బాధితుడి నుంచి అధికారిక పని నిమిత్తం ఎఫ్‌ఆర్‌ఓ మొయినుద్దీన్ 80 వేల లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫి ర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో వల పన్ని న ఏసీబీ అధికారులు, గురువారం కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా మొయి నుద్దీన్‌ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలోని రి కార్డులను, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.






