17 July, 2026 | 12:18 AM

జాన్ పహాడ్ దర్గా వద్ద జరుగుతున్న అక్రమాలపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

17-07-2026 12:18 AM

పాలకవీడు, జులై 16: జాన్ పహాడ్ దర్గా వద్ద జరుగుతున్న అక్రమ వసూళ్లు, దౌర్జన్యాలు, దళారుల దోపిడి, భక్తులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ గురువారం రోజు జాన్ పహాడ్ దర్గా ప్రాంగణంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి జాన్ పహాడ్ దర్గా ఉపసర్పంచ్ రాజు రాథోడ్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్బంగా రాజు రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద దర్గా 400 సంవత్సరాలు చరిత్ర కలిగిన పవిత్రమైన దర్గా దైవభక్తితో వచ్చే భక్తుల దగ్గర పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లు దళారుల దోపిడీ రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ సమస్య మీద దర్గా ఇన్స్పెక్టర్ నుండి జిల్లా కలెక్టర్ వరకు మరియు వక్ఫ్ బోర్డు సీఈవో చైర్మన్ కు రాతపూర్వకంగా పత్రాలు ఇచ్చిన ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం.

అధికారికంగా టెండర్ ప్రక్రియతో, రేట్ల పట్టికను ఏర్పాటు చేయాలన్నారు,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి, అధికారిక రేట్ల పట్టికను ప్రదర్శించాలని, దర్గా వద్ద జరుగుతున్న అక్రమాలపై సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా కోరింది.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, ప్రజాసంఘా నాయకులు ఏఐబిఎస్‌ఎస్ నరి నాయక్, మాజీ ఎంపీటీసీ రామారావు, గిరిజన శక్తి నాయకులు మధు నాయక్, బీజేపీ కార్మిక జిల్లా అధ్యక్షుడు శేషగిరి, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాపోలు నవీన్, అశోక్ నాయక్, రమేష్ నాయక్, పెరుమాళ్ళ సతీష్, మైబెల్లి మరియు సుబ్బు, లక్ష్మీ నారాయణ, మోతీలాల్, భార్గవ్ చారి, ప్రకాష్, బాలు నాయక్ తదితరులు పాలుగోన్నారు.