22 March, 2026 | 11:27 AM

ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

08-10-2025 12:26 AM

వాల్మీకి జయంతి వేడుకల్లో శాసనసభ్యులు బండ కృష్ణమోహన్ రెడ్డి. 

గద్వాల్ అక్టోబర్ 7: కేటి దొడ్డి మండలం నందిన్నె గ్రా మంలో వాల్మీకి మహర్షి జయం తి సందర్భంగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాల్మీకి సంఘం నా యకులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ వాల్మీకి సోదరులకు వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి గ్రామంలో వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయడంతో జయంతినీ ఒక పండుగ వా తావరణం నెలకొంటుందని ప్రతి ఒక్కరూ భక్తి భావంతో దేవుని అనుగ్రహం ఉన్నప్పుడే మనం ఏం పని చేసిన విజయం కలుగుతుందని తెలిపారు. గ్రామాలలో రైతులు ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వాల్మీకి మహర్షి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వాల్మీకి మహర్షి రచించిన రా మాయణం లోని సీతారాముల గురించి ప్రపంచానికి తెలియజేసిన గొప్ప మహర్షి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, వాల్మీకి సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.