10-11-2025 12:00:00 AM
ప్రభుత్వ హాస్టళ్ళు, గురుకులాలు స్వంత భవనాలు నిర్మించాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
హాస్టల్ బకాయిలు, అద్దె బకాయిలు చెల్లించాలని వేలాది మందితో ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా
ముషీరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములు వేలం వెయ్య రాదని, ఇట్టి స్థలాలు, హాస్టళ్ళు గురుకులాలు స్వంత భవనాలు కట్టడానికి వినియోగించాలని, హాస్టళ్ళ మెస్ బిల్లులు, అద్దె బకా యిల ను చెల్లించాలని అదనంగా 150 బి.సి కాలేజి హాస్టళ్ళు మంజూరు చేయాలని జాతీ య బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశా రు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర బీసీ యువజన సం ఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్ ఆద్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వేలామందితో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ భారీ ధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కో -ఆర్డినేటర్ ర్యాగ అరుణ్ కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్య క్షుడు అంజి, రాష్ట్ర బీసీ ఐఖ్య వేదిక అధ్యక్షుడు జీ. అనంతయ్య, రాష్ట్ర బీసీ హక్కుల పోరాట సంఘం అధ్యక్షుడు సీ. రాజేందర్, రాష్ట్ర బీసీ విద్యార్ధి సంఘం కన్వీనర్ సతీష్, శివ యాదవ్, కార్యదర్శి అజయ్, భీం రాజు, బోయ గోపి, రాంగోపాల్ యాదవ్, తదితరులు హాజయ్యారు.
ఈ సందర్భంగా జరిగి న బహిరంగ సభను ఉద్దేశించి ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ హాస్టళ్ళ నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్షం మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తులు వీటిని ప్రజా అవసరాలకు, పేదల ఇండ్లు కట్టడానికి ప్రభుత్వ ఆఫీసులకు హాస్టళ్ళకు, స్కూల్‌కు నిర్మాణానికి ఉపయోగించాలన్నారు. అంతే గాని అమ్మడానికి కాదన్నారు. ఇప్పుడు అమ్మితే భావితరాలకు ఏమి ఉం టుందన్నారు.
గతంలో కూడా ప్రభుత్వాలు అమ్మడానికి ప్రయత్నం చేశారని, అప్పుడు మేము గట్టిగా వ్యతిరేకించడంతో అమ్మడాని ఆపేశారన్నారు. ఇప్పుడు కూడా ప్రభు త్వ భూమి అమ్మడం ఆపేయాలన్నారు. ప్రభుత్వ స్థలాలను వేలం వేయరాదని, ఇది బీసీ కాలే జీ హాస్టళ్ళు, బీసీ గురుకుల పాఠశాలకు సొం త భవనాలు నిర్మించాలని డిమాం డ్ చేశా రు. స్వంత భవనాలు లేకపోవడం వలన అ ద్దె భవనాలలో నిర్వహిస్తున్నారన్నారు. పైగా ఏటా అద్దె కింద కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, అన్ని వసతులతో స్వంత భవనా లు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.