21 March, 2026 | 8:16 PM

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి

21-03-2026 06:53 PM

చండూర్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు 

చండూరు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం

చండూరు,(విజయక్రాంతి): చండూరు మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని, చండూరు మున్సిపాలిటీలో రోడ్లన్నీ పరిశుభ్రంగ ఉండాలని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. శనివారం చండూరు మున్సిపాలిటీలోని పలు సమస్యలపై  చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ వార్డులలోని  పలు సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, చండూరు మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుతూ, సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ప్రజల వద్దకే వెళ్లి, పరిసరాలను ఎవరికివారు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తున్నామన్నారు. షాప్ ల వద్ద అందరూ డస్ట్ బిన్నులను ఏర్పాటు చేసుకోవాలని, చెత్తను డస్ట్ బిన్నులలో మాత్రమే వేసి మున్సిపాలిటీ ట్రాక్టర్ వచ్చినప్పుడు వేయవలెనని కోరారు. ప్రతి షాప్ ముందు యజమానులు ఎవరికి వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా నంది హోమ్స్ లోని నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. వర్షాకాలంలో మున్సిపాలిటీ ప్రజలకు మొక్కల్ని ఇచ్చి, పెంచే విధంగా కృషి చేస్తామన్నారు. డంప్ యార్డును మరియు అంబేద్కర్ పార్క్,నేతాజీ పార్కులను సందర్శించి, మునుగోడు రోడ్ లో ఉన్న నేతాజీ పార్క్ ను  మున్సిపాలిటీ ప్రజలు వాకింగ్ చేయడానికి ఉపయోగించుకోవాలని కోరారు.  చండూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారికి రోడ్డుకు ఇరువైపులా షాపుల వెంట మెట్లను మరియుర్యాంపుల ను నిర్మించుకోకుండా మట్టిని పోసుకున్నారని ఇట్టి మట్టిని తొలగించి మెట్లనుర్యాంపులను ఒక ఫీట్ లోపు వచ్చే విధంగా కట్టుకోవాలని ఆయన సూచించారు.