21 March, 2026 | 8:16 PM

అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ

21-03-2026 06:50 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి శ్రీనివాస థియేటర్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో ఉంచడమే నా లక్ష్యమన్నారు. ఎంఎల్ఏ వెంట కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులున్నారు.