29 August, 2026 | 9:32 AM

కాంగ్రెస్ పాలనలో అందరికీ మంచి జరగాలి

21-05-2024 01:42 AM

యాదాద్రిలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావు పూజలు

 యాదాద్రి భువనగిరి, మే 20( విజయక్రాంతి) : గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ ఇవ్వకుండా ఖజానా ఖాళీ చేసిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు నడిచేలా సీఎం రేవంత్‌రెడ్డికి మనోధైర్యం ఇవ్వాలని, మంచి పాలన సాగించి అందరికి న్యాయం చేయాలని, సంక్షేమ పథకాలు కొనసాగాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరే విధంగా దీవించాలని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకున్నట్టు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు తెలిపారు.

సోమవారం ఆయ న ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శిం చారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ యాదగిరి గుట్ట ఆలయాన్ని రాష్ట్రంలోనే గొప్ప ఆలయంగా తీర్చి దిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు వివరించా రు. స్పీకర్ హోదాలో సోమవారం స్వామివారిని దర్శించుకున్న ఆయన రాష్ట్ర ప్రజ లు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని వేడుకున్నట్టు తెలిపారు.