పల్లెలోని సందళ్లన్ని మీవే..
‘కోర్ట్’ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవీ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘బ్యాండ్ మేళం’ అంటూ రాబోతోన్నారు. రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. సతీశ్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 13న విడుదల చేయబోతోన్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక పాట, టీజర్ విడుదల కాగా, మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు మేకర్స్ రెండో పాటనూ విడుదల చేశారు. ‘పల్లెలోని సందళ్లన్ని మీవే..’ అంటూ సాగే మెలోడీని హీరో రవితేజ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. విజయ్ బుల్గానిన్ స్వరపర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, శ్వేతా మోహన్ ఆలపించారు. గిరి, రాజిల స్కూల్, బాల్య స్మృతులకు సంబంధించిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; డీవోపీ: సతీశ్ ముత్యాల; ఆర్ట్: నార్ని శ్రీనివాస్; స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు; రచయిత, దర్శకుడు: సతీశ్ జవ్వాజి.




