28 June, 2026 | 3:12 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

మా అమ్మ పాత చున్నీతో చొక్కా కుట్టించుకున్నా!

04-03-2026 12:38 AM

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. ఇందులో గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్లు. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేశ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీనాథ్ విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు. 

* మా టైటిల్ ‘మెన్షన్ హౌస్ మల్లేష్’.. అయితే ఓవర్ లుక్‌లో టైటిల్‌ని అలా అనిపిపిస్తోంది. ఇందులో నా క్యారెక్టర్ తప్పుగా ఆ పేరు రాస్తాడు. కానీ, జనం రైట్‌గా చదువుతున్నారు. సినిమాకు క్యాచి టైటిల్ కావాలి. అలా ఈ టైటిల్‌తో ఆకట్టుకున్నాం.  

* ఇందులో నా క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుంది. -ఒక పొగరుబోతు, దారితప్పి లేనిపోనీ అలవాట్లుతో వున్న ఓ పాత్రను అతని తల్లి, భార్య ఎలా దారిలోకి తీసుకోస్తారనేది చాలా సరదాగా చెప్పాం. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ కామెడీ జానర్ ఫిల్మ్.  

* నన్ను నేను కొత్తగా చూపించుకోడానికి ఒక అవకాశం దొరికింది. ఈ సినిమా కోసం కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ను పరిశీలించాను. మా అమ్మ పాత చున్ని ఉంటే దాన్ని చొక్కాగా కుట్టించుకుని వేసుకున్నాను. మల్లేష్‌ను నాలో చూపించడానికి నేను చాలా మారాల్సి వచ్చింది. ఈ సినిమాతో ప్రేక్షకులు నా పేరు గుర్తుపెట్టుకుంటారని నమ్ముతున్నా. ఇంకా కొత్తగా ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చేస్తున్నా. సోలో హీరోగా కొన్ని కథలు వింటున్నా.