మహిళలందరూ చదువుకోవాలి
మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ
సుల్తానాబాద్, మార్చి 29 (విజయ క్రాంతి): మహిళలందరూచదువుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాల ను సద్వినియోగపరుచుకోవాలని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు,
ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టినటువంటి అక్షర వికాసం ఉల్లాస్ కార్యక్రమం ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు మెప్మా వారి ఆధ్వర్యంలో గ్రూపు మహిళలలో చదువు రానటువంటి మహిళలను గుర్తించి ప్రభుత్వం నుంచి వారికి బుక్స్ పంపిణీ చేసి వాలంటీర్లచే చదువు చెప్పే కార్యక్రమాన్ని ప్రారంభించారు,
మున్సిపల్ పరిధిలోని 2,3,4,5,6,15 వ వార్డు గ్రూప్ మహిళలకు దర్జీ భవన్ లో పరీక్షలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో వార్డ్ కౌన్సిలర్లు గాజుల రాజమల్లు , కందునూరి సమత కుమార్ , గరిగే శోభారాణి శ్రీనివాస్ . బాకం సాయి , గాదాసు మంజుల రవి , ఊట్ల వరప్రదీప్ , మెప్మా వారు పాల్గొన్నారు.




