calender_icon.png 4 February, 2026 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌లో చేరిన అల్లం శ్రీనివాస్ రెడ్డి

04-02-2026 01:32:56 AM

మొయినాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మొయినాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అజీజ్నగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అల్లం శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి, మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సబితా ఇంద్రారెడ్డి ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు సాగుతున్నాయని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి రాకతో మొయినాబాద్ ప్రాంతంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అల్లం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రజా సేవలో ముందున్న బీఆర్‌ఎస్ కుటుంబంలో చేరడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

కార్యకర్తలతో కలిసి పార్టీ విజయం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమం లో  ఎన్నికల ఇంచార్జీలు ముఠా జయసింహ, అమృత్ చౌహన్ రాష్ట్ర నాయకులు: కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నరసింహారెడ్డి మండల నాయకులు: వెంకట్ రెడ్డి (పార్టీ ప్రెసిడెంట్), మాణిక్ రెడ్డి, నరోత్తం రెడ్డి, మహబూబ్, కృష్ణ రెడ్డి, జయవంత్ తదితరులు పాల్గొన్నారు.