5 May, 2026 | 4:22 PM

మళ్లీ కామెడీ జానర్‌లోకి అల్లరి నరేశ్

07-09-2025 12:00 AM

అల్లరి నరేశ్ మరో కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. తొలినాళ్లలో కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన ఆ తర్వాత పలు జానర్లలో మెప్పించారు. అయితే, ఆయన ఇప్పుడు తన 65వ చిత్రంతో  తిరిగి కామెడీ జానర్‌లోకి వస్తున్నారు. ‘నరేశ్65’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ కొత్త ప్రాజెక్ట్‌ను దర్శకుడు చంద్రమోహన్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ఫాంటసీ, కామెడీ బ్లెండ్ తో రిఫ్రెషింగ్‌గా ఉండబోతోంది. ‘కామెడీ గోస్ కాస్మిక్’ అని మేకర్స్ చెప్పడం క్యురియాసిటీని పెంచింది. అయితే, ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి మూవీ యూనిట్‌తో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. నాగచైతన్య ము హూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. స్టార్ డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

దర్శకుడు వీఐ ఆనంద్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వశి ష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. హరీశ్ శంకర్, సుప్రియ యార్లగడ్డ, అనిల్ సుంకర, జెమిని కిరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

వెన్నెల కిషోర్, నరేశ్ వీకే, శ్రీనివాస్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిసున్నారు. రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీగా, చేతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడిగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.