పుష్ప3 కచ్చితంగా ఉంటుంది: సుకుమార్
07-09-2025 12:00 AM
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్బస్టర్ చిత్రం ‘పుష్ప2‘ సైమా 2025 లో ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. మరోవైపు ‘పుష్ప3: ది ర్యాంపేజ్’ పేరుతో మూడో భాగం రానున్నట్లు గతంలో పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆ పోస్టర్ రిలీజ్ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌నూ టీమ్ ఇవ్వలేదు. అసలు ‘పుష్ప3’ ఉంటుందా.. లేదా..? అన్న అనుమానాలను సైమా వేదికగా సుకుమార్ నివృత్తి చేశారు. వేదికపై వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘పుష్ప3’ కచ్చితంగా ఉంటుందిగా..’ అన్నారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు.






