calender_icon.png 6 September, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ గ్రూప్‌లో అలాంటి ఫొటోలు షేర్ చేస్తా

06-09-2025 12:33:24 AM

‘లోక చాప్టర్1: చంద్ర’ కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తోనే తెరకెక్కి, వారంలోనే రూ.100 కోట్లు వసూళ్లు రాబట్టిన మలయాళ చిత్రం. ఇప్పుడు తెలుగు నాట కూడా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో సినీప్రియులను ఆకర్షిస్తోంది. మలయాళంలో విడుదలైన తొలి లేడీ సూపర్ హీరో సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో యాక్షన్‌తో అదరగొట్టింది హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు బదులుగా చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఫేవరెట్ డ్రింక్స్ అంటే ఎవరైనా ఫ్రూట్స్ డ్రిక్స్ లేదా కూల్‌డ్రింక్స్ పేర్లు చెప్తారు కానీ, కళ్యాణి మాత్రం ‘నాకు హాట్ వాటర్ అంటే ఇష్టం. ఐ లైక్ హాట్ వాటర్.. మార్నింగ్ లేవడంతోనే హాట్ వాటర్ తాగుతాన’ంటూ బదులిచ్చింది. ‘హాట్ వాటర్ గ్యాంగ్’ అనే సిల్లీ వాట్సప్ గ్రూప్ ఉంది. పొద్దున లేవగానే ఒక హాట్ వాటర్ గ్లాస్ ఫోటో పోస్ట్ చేస్తా.. నైట్ పడుకునేటప్పుడూ అలాంటి ఫోటోనే షేర్ చేస్తా.

ఉదయం లేవగానే హాట్ వాటర్ తాగడం వల్ల ఎంతో  ఆరోగ్యకరం’ అని తెలిపింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా ఫ్రెండ్స్‌కు టైమ్ కేటాయిస్తూ ఉంటే.. ఎంత స్ట్రెస్ అయినా సులువుగా తగ్గించుకోవచ్చు’ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి సిల్లీ గ్రూప్స్ తమకూ ఉన్నాయని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.