సెటిల్మెంట్ ఆరోపణలు అవాస్తవం
- విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం చేసిన కేసు దర్యాప్తులో ఉంది
- కేసు సెటిల్మెంట్ చేసుకుంటామని ఇరువర్గాలు చెప్పారు
- చైతన్యపురి సీఐ సైదులు
ఎల్బీనగర్, జూన్ 10 : విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నుంచి లక్షలా ది రూపాయలు వసూలు చేసిన కేసులో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సీఐ సైదులు తెలిపారు. పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు వచ్చారని, కేసును బయట పరిష్కరించుకుంటామని చెప్పారని... ఈ కేసులో ఎక్కడా పోలీసుల జోక్యం లేదని సీఐ సైదులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళ్తే... విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలో నివాసం ఉండే ఎన్.సుజాతకు తనకు తెలిసిన వ్యక్తి ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాలు, వీసా ప్రక్రియ సేవలందించే సరస్వతి, హరీశ్ రాజు, నాగేందర్, నరేందర్ పరిచయమయ్యారు. విదేశాల్లో ఉద్యోగాలు, చెల్లుబాటయ్యే వీసాలు, వర్క్ పర్మిట్ లను 2 నుంచి 3 నెలల్లోనే ఇప్పిస్తామని సుజాత కార్యాలయానికి వచ్చి మాట్లాడారు.
ఈ క్ర మంలో గత ఏడాది ఆగస్టు 23న హరీశ్ రాజు, నాగేందర్, నరేందర్ క్వెస్ట్ బిజినెస్ టెక్ (క్యూబీటీ) ఖాతా కు సుజాతకు చెందిన సెకండ్ మినిట్ ఓవర్సీస్ వీసా ప్రాసెసింగ్ కార్యాలయంలో ఒప్పం దం చేసుకుని డాక్యుమెంటేషన్, జీఎస్టీ ఫైల్ నిర్వహణ ఛార్జీల వంటి వివిధ కారణాలు చెప్పి అదేరోజు ఒక లక్ష రూపాయలను సుజాత అకౌంటు నుంచి హరీశ్ రాజ్ తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు.
వారిని నమ్మి, చెక్ రిపబ్లిక్, జర్మనీ వంటి దేశాల్లో అవకాశాల కోసం 31 మంది అభ్యర్థుల దరఖాస్తుల ప్రాసెస్ కోసం సుజాత క్వెస్ట్ బిజినెస్ టెక్ అకౌంటుకు, ఐటీ కారణాలతో వ్యక్తిగత ఖాతాలకు మొత్తం రూ.39 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత అనేక వీసా దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. దీంతో హరీశ్ రాజు, నాగేందర్, నరేందర్ సమర్పించిన వర్క్ ప ర్మిట్లు, ఎంబసీకి సంబంధించిన పత్రాలు నకిలీవని, మోసపూరితమైనవని సుజాత గుర్తించింది. సుజాత వెంటనే తమ డబ్బు తిరిగి ఇవ్వమని పై ముగ్గురిని అడిగితే దాటవేశారు.
ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు సుజాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు హరీశ్ రాజు, నాగేందర్, నరేందర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, వీసాలు త్వరగా ఏర్పాటు చేస్తామని పలువురు నుంచి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులైన దారపురెడ్డి నాగేందర్, పల్లం నరేందర్ వారికి నోటిస్ ఇచ్చి పంపించారు.
కాగా, పోలీస్ స్టేషన్ లోనే కార్డు స్త్వ్రప్ చేసి రూ.8.14 లక్షలు వసూలు చేశారని ఎల్బీనగర్ ఏసీపీ, చైతన్యపురి ఎస్‌ఐలపై ఆరోపణలు చేస్తూ ఎల్బీనగర్ డీసీపీకి క్వెస్ట్ బిజి నెస్ టెక్ భాగస్వాములు నాగేందర్, నరేందర్ మంగళ వారం ఫిర్యాదు చేశారు. అయితే, కానీ పోలీస్ స్టేషన్లో ఎలాంటి డబ్బుల లావాదేవీలు జరగలేదని సీఐ సైదులు తెలిపారు. తమపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.






