తపస్ ఆధ్వర్యంలో 'గురువందన్'
29-07-2026 04:54 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో బుధవారం 'గురువందన్' కార్యక్రమం నిర్వహించారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన దక్షిణ మధ్య భారత విద్యా ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, ఆంగ్ల ఉపన్యాసకులు డాక్టర్ యు. రవికుమార్, విశ్రాంత ఉపాధ్యాయులు కడార్ల రవీంద్ర, పూర్వ ఆచార్యులు పట్వారి శ్రీనివాస్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అఅధ్యక్షుడు గోనెల శశిరాజ్ మాట్లాడుతూ.. భారతీయ సమాజంలో ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు దేశ నిర్మాణం, వ్యక్తిత్వ వికాసం, సమాజ అభ్యున్నతిలో గురువుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర బాధ్యులు రాజేశ్వర్, నాయకులు రమణ, నరేష్, శ్రీకాంత్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.






