26 August, 2026 | 11:44 PM

ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారు.. ఎప్పుడు ఇస్తారు?: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

11-06-2024 05:22 PM

హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలేటి మాట్లాడుతూ.... విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల భరోసా కార్డు ఏమైంది?, పింఛన్లను రూ. 4వేలకు పెంచుతామన్నారు.. ఎప్పుడు పెంచుతారు?, 18 ఏళ్లు దాటిన విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారు.. ఎప్పుడు ఇస్తారు?, ఫిబ్రవరిలోనే గ్రూప్-1, గ్రూప్ -2 నోటీఫికేషన్లు ఇస్తామన్నారు... ఇచ్చారా? అని మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.