26 August, 2026 | 10:32 PM

విమాన ప్రమాదంలో మలావీ వైస్ ప్రెసిడెంట్ దుర్మరణం

11-06-2024 05:54 PM

జొహన్నెస్‌బర్గ్: ఆఫ్రికా దేశమైన మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా, అతని భార్యతో సహా మరో 9 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్న విమానం చికన్‌గావా పర్వత శ్రేణిలో కుప్పకూలడంతో మరణించినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం జాతీయ సంతాపదినంగా ప్రకటించారు. దురదృష్టవశాత్తూ, విమానంలో ఉన్న వారంతా ఈ ప్రమాదంలో చనిపోయారని క్యాబినెట్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్తర మలావీలో పొగమంచుతో కూడిన అడవిలో విమాన శకలాలను శోధించిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ విమానాన్ని కనుగొందని పేర్కొంది. సోమవారం ఉదయం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయలుదేరిన సైనిక విమానం కూలిపోయింది. చిలిమా మాజీ అటార్నీ జనరల్ అంత్యక్రియలకు హాజరు కావడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.