27 August, 2026 | 1:04 AM

టీజీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

11-06-2024 05:12 PM

హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి మంగళవారం టీజీ ఎడ్ సెట్ 2024 ఫలితాలను విడుదల చేసింది. ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజీ వర్సీటీ ఇన్ఛార్జి వీసీ నవీన్ మిట్టర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 96.90 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ edcet.tsche.ac.in లో చూసుకోవచ్చని వెల్లడించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మే 23, 2024న జరిగిన ఈ పరీక్షలో 28,549 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 98.74 శాతం మహిళలున్నారు. ఎడ్ సెట్ లో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నవీన్ కు మొదటి ర్యాంకు, మైదరాబాద్ యువతి అషితకు రెండో ర్యాంకు వచ్చింది. మూడో స్థానంలో శ్రీతేజ ఉన్నారు. ఎడ్ సెట్ కు 29,463 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.