19 March, 2026 | 3:19 AM

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులు కేటాయించండి

19-03-2026 01:43 AM

మంత్రి శ్రీధర్ బాబుకు బ్రాహ్మణ ప్రతినిధుల వినతి పత్రం

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి) : తెలంగాణా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు ఛైర్మన్, సభ్యులను నియమించడంతో పాటు నిధులు కేటాయించాలని బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ (బాస్) ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. ఈ మేరకు బుధవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి విజ్ణాపన పత్రం సమర్పించారు.

’బాస్’ చీఫ్ కోఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల ప్రతినిధులు శాసనసభ ప్రాంగణంలోని కార్యాలయంలో శ్రీధర్ బాబును కలిసి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. నందిరాజు లక్ష్మినారాయణ, అన్నావజ్జుల సూర్యప్రకాశ్, నిరంజన్ దేశాయి, మంగు రాఘవరావు, ప్రమోద్, వై. శ్రీనివారావులు తమ డిమాండ్లను శ్రీధర్ బాబుకు వివరించారు. వినతి పత్రం స్వీకరించిన శ్రీధర్ బాబు వారి విన్నపాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.