రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, మార్చి18 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రజలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖఃసంతోషాలు, నూతన వెలుగు లు నింపాలని, ప్రతి ఇంటా సిరిసంపదలు వర్థిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఉగాది శుభాకాం క్షలు తెలిపారు.
గురువారం నుంచి శ్రీపరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుండటంతో.. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని సీఎం ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, సమృద్దిగా వానలు కురిసి పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరకీ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.




