పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
వారం రోజులు వర్షాలు
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాగల వారంరో జులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. శుక్ర, శనివా రాల్లో పల్లు జిల్లాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వర్షంతోపాటు ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం హైదరాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.






