3 August, 2026 | 8:47 AM

సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

24-08-2024 12:27 AM

సుప్రీం కోర్టు ఆదేశాలతో వెనక్కి

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): సుప్రీం కోర్టు ఆదేశాలతో ఢిల్లీ ఎయిమ్స్, ఆర్‌ఎంఎల్ వైద్యులు ఆందోళన విరమించిన నేపథ్యంలో తెలంగాణ జూనియర్ డాక్టర్లు సైతం సమ్మె విరమించినట్టు ప్రకటించారు. కోల్‌కతాలో వైద్యురాలిపై లైంగికదాడి ఘటనను ఖండిస్తూ, ఆస్పత్రుల్లో వై ద్యులకు భద్రత కల్పించాలని డిమాం డ్ చేస్తూ పది రోజులుగా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు ఆందోళనలు చేపట్టారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ఆందోళనలను విరమించకుంటున్నట్టు శుక్రవారం ఒక ప్రకటన విడు దల చేశారు. ‘డాక్టర్ అభయ’కు న్యాయం జరగాలని కోరారు.