07-05-2025 07:05:34 PM
భద్రాచలం (విజయక్రాంతి): మన్యం దొర అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్బంగా బుధవారం భద్రాచలం అంబేడ్కర్ సెంటర్ లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహనికి బిజెపి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ మెంబెర్ కుంజా ధర్మం, జిల్లా నాయకులు నిడదవోలు నాగబాబు, సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ ములిశెట్టి రామ్మోహన్ రావు, చెల్లుబోయిన వెంకన్న, పిసి కేశవ్, బోడ సత్యనారాయణ, చక్రవర్తి, తెలగాని సురేష్, మండల నాయకులు ముత్యాల చంద్ర శేఖర్, అల్లాడి వెంకట సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.